రాజంపేట మండలం ఇసుకపల్లెకు చెందిన ప్రకాష్ (48) మంగళవారం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ప్రకాశ్ రాజంపేట వాసులకు సుపరిచితుడు. గత కొన్నేళ్లుగా ప్రకాశ్ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నాడు. ప్రకాష్ మృతితో ఇసుకపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.