నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

276చూసినవారు
నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు
పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు 0–5 ఏళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు రెండు పోలియో చుక్కలు వేయించాలి అని కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ సోమిశెట్టి మనోహర్ బాబు అన్నారు. ఒంటిమిట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

అనంతరం మనోహర్ బాబు మాట్లాడుతూ.. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాయని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్