తమిళ స్టార్ హీరో సూర్య, KR మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన 'గజిని' సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ త్వరలో తీసేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే 'గజిని' సీక్వెల్ ప్రపోజల్ అరవింద్ తీసుకొచ్చారని, ఇది సాధ్యమైతే తనకు ఓకే అని చెప్పినట్లు హీరో సూర్య పింక్‌విల్లాతో తెలిపారు. ఒకేసారి సూర్య, అమీర్ ఖాన్‌తో షూటింగ్ జరిపి రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.