గాలివీడు ఎంపీడీవో పై అతని కార్యాలయంలో భౌతిక దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని సిపిఐ (ఎంఎల్) అన్నమయ్య జిల్లా నాయకులు విశ్వనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారులపై జరిగిన దాడులు నేడు కూటమి ప్రభుత్వ పాలనలో పునరావృతం కావడం సిగ్గు చేటు చర్య అన్నారు. సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాలి కానీ ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం సరి కాదన్నారు.