రాయచోటి: "అధికారులపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు"

82చూసినవారు
రాయచోటి: "అధికారులపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు"
విధి నిర్వహణలో ఉన్న గాలివీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసిపి నాయకులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాలివీడు మండలం, ఎంపీడీవో పై కొంతమంది వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

సంబంధిత పోస్ట్