ఈ నెల 9న కాకినాడలో ఉద్యోగ మేళా

84చూసినవారు
ఈ నెల 9న కాకినాడలో ఉద్యోగ మేళా
ఈ నెల 9న కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు. శనివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ కంపెనీలో యూఎస్ ఐటీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ముఖాముఖి నిర్వహించనున్నట్లు వివరించారు. 2023, 2024 సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్