గొల్లప్రోలులో కనువిందు చేస్తున్న రుద్రాక్షల వినాయకుడు

70చూసినవారు
గొల్లప్రోలులో కనువిందు చేస్తున్న రుద్రాక్షల వినాయకుడు
గొల్లప్రోలు పట్టణ శివారు ఈబీసీ కాలనీకి చెందిన కోలా వీరబాబు రుద్రాక్షలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. దీనికోసం సుమారు 5 వేల రుద్రాక్షలను ఉపయోగించాడు. వీరబాబు తయారు చేసిన నాలుగు అడుగుల వినాయకుడు, మూడు అడుగుల శివలింగం ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వీటిని శనివారం వినాయకచవితి ఉత్సవాల్లో కోసం ప్రతిష్టించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్భంగా వీరబాబు మానవాళికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్