ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్‌లో దారుణం జరిగింది. మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త.. అతని కుటుంబ సభ్యులు సదరు మహిళపై దాడి చేసి, గుండు గీయించారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సదరు మహిళను కొంత మంది చేతులు, కాళ్లు కట్టి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.