కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం క్షేత్ర పాలకురాలైన శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రత్యంగిర హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ రోజు కొత్త అమవాస్య సందర్భంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని పూజలు చేశారు. వైదిక కమిటీ సభ్యులు పురోహితులు అర్చకుల ఆధ్వర్యంలో జరిపించే ప్రత్యంగిరా హోమం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సుదీర్ఘంగా రెండు గంటలపాటు నిర్వహించారు. పూజలో అన్ని రకాల పండ్లు పూజా ద్రవ్యాలు కలిపి మూటగట్టి పూర్ణాహుతితో అగ్ని దేవునికి సమర్పించి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవి రామారావు, దేవస్థానం అధికారులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.