శంఖవరం మండలంలోని వజ్రకూటం గ్రామానికి చెందిన కీర్తి రాణి తన ఇంటి ప్రహరీ కూల్చేశారని గురువారం అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణపతి నిమజ్జనం కార్యక్రమం చూడడానికి వెళ్లి వచ్చేసరికి తమ గోడను కీర్తి కృష్ణ, కేళంగి బాబులు పడగొట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎస్ఐ కిశోర్ ను వివరణ కోరగా ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు.