తుని ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికత, మెడికల్ సామగ్రి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా 8 మంది సభ్యులతో కలిసి ఆమె ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, డాక్టర్ల కొరత లేకుండా చూస్తామన్నారు. నూతనంగా థైరాయిడ్ పరీక్షా కేంద్రం మంజూరు అయిందని ఆమె తెలిపారు.