కూటమి గెలుపే లక్ష్యంగా కాకినాడ పార్లమెంట్ తుని నియోజకవర్గ ఇన్చార్జ్ దేవ్ మధు వీరేష్ ఆధ్వర్యంలో తుని నియోజకవర్గం తొండంగి మండలం కృష్ణాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ కాకినాడ పార్లమెంటు అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుపై అలాగే తుని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దివ్య సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాకినీడి శ్రీధర్ , మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు , ఉమ్మడి జిల్లాల జాయింట్ సెక్రెటరీ పలివేల లోవరాజు, లక్ష్మణ్, మందపల్లి శ్రవణ్ కుమార్, మణికుమార్, నరిసే సుబ్రహ్మణ్యం, బాబు మురళీకృష్ణ , మరియు కృష్ణాపురం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.