తిరుపతిలో కిడ్నాప్ కలకలం.. కేసును ఛేదించిన పోలీసులు

72చూసినవారు
తిరుపతిలో కిడ్నాప్ కలకలం.. కేసును ఛేదించిన పోలీసులు
తిరుపతి జిల్లా భాకరాపేటలో కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 24న చిన్నగొట్టిగల్లు మండలం చెరువుమందరపల్లిలో భాస్కర్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన దుండగులు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. తన తండ్రిని కిడ్నాప్‌ చేశారంటూ కిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను భాకరాపేట వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి డమ్మీ పిస్టల్‌, మత్తు సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్