స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా సఫాయి సురక్ష మెడికల్ క్యాంపులు జిల్లాలోని అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం పంచాయతీ, మున్సిపాలిటీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలులు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇస్తారని, కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.