అమలాపురం: 315 పంచాయతీల్లో 766 పనులు: కలెక్టర్

83చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పల్లె పండగ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ మహేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్లో ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పంచాయతీల పరిధిలో రూ. 54. 30 కోట్ల ఉపాధి మెటీరియల్ కాంపోనెట్ నిధులతో 766 పనులకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్