అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో షాపు అద్దె వివాదంపై టీడీపీ & జనసేన, వైసీపీ కౌన్సిలర్లు మధ్య వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ నాగేంద్రమణి అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఖాళీ బాండ్లు ఇస్తే అగ్రిమెంటు ఇచ్చినట్లు కాదని టీడీపీ కౌన్సిలర్ బొర్ర వెంకటేశ్వరరావు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇదే అంశంపై, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు మధ్య వివాదం జరిగింది.