మాజీ సీఎం జగన్ పై కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు అన్నారు. ఆయన అమలాపురం మండలం అమలాపురంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. యూఎస్ఏలో రిజిస్టర్ అయ్యిన ఎఫ్ఎఆర్లో ఎక్కడ మాజీ సీఎం జగన్ పేరు లేదని అన్నారు. జగన్ పై వస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవని ఎమ్మెల్సీ అన్నారు. కూటమి నాయకులు కావాలని తప్పుడు అభియోగాలు చేస్తునారని ఆయన అన్నారు.