రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు తెన్నేటి కిషోర్ మాదిగ డిమాండ్ చేశారు. అమలాపురం ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాను యూనిట్ గా తీసుకోవడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల మాదిగలతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్న మాదిగలు నష్టపోతారన్నారు. 1997లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ అమలు చేయాలన్నారు.