భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే దశగా డిమాండకు అనుకూలంగా ఉచిత ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఇసుక సరఫరాపై కలెక్టర్ వారితో చర్చించారు.