అమలాపురం నియోజకవర్గ పరిధిలోని బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఆయన ఆదివారం అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ. బెల్ట్ షాపులు రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు బెల్ట్ షాప్లు లేకుండా చూడాలని అధికారులను అదేశించారు. మద్యం అధిక ధరలకు అమ్మినా చర్యలు తీసుకుంటామన్నారు.