అమలాపురంలో శుక్రవారం జరిగిన కోనసీమ డిస్ట్రిక్ట్ అండర్-9 బాలికల చదరంగ పోటీలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఎన్ ఆరాధ్య ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా అండర్ 13 చదరంగ పోటీలలో పి మహీధర్ మూడవ స్థానం సాధించి స్టేట్ లెవల్ చెస్ ఛాంపియన్షిప్ కి అర్హత పొందాడని కోచ్ వి. శ్రీను బాబు తెలియజేశారు. చక్కటి ప్రతిభను కనబరిచిన విద్యార్థులను చైర్మన్ మనువిహార్, ప్రిన్సిపాల్ దేవిలు అభినందించారు.