ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలో మూడు రోజుల పాటు జాతీయ స్థాయి మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ఆహ్లాదకరంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. ఆదివారం భారీ స్థాయిలో హాజరైన క్రీడాభిమానులు పోటీలను తిలకించారు. ఆంధ్ర గోవాగా పేరు గాంచిన ఎస్. యానాం తీరంలో క్రీడాభిమానులు తమ మొబైల్ ఫోన్లలో లైట్లు ఆన్ చేసి కనువిందు చేశారు. సముద్ర తీరం ఫోన్ ల వెలుగులతో నిండి ఆకట్టుకుంటుంది.