ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురంలోని కలెక్టరేట్ నుండి ఆమె, జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియ నిర్వహణ వివరాలను ఆమె తెలియజేశారు.