ఈనెల 25 నుంచి 21వ అఖిలభారత పశుగణన సర్వే దేశవ్యాప్తంగా మొదలవుబోతోందని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 426 రెవెన్యూ గ్రామాలలో ఇదివరకే గుర్తించిన 285 మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వే చేపట్టనున్నారన్నారు. వీరికి పశుగణన మొబైల్ అప్లికేషన్ వినియోగించడంపై గత ఆగస్టు నెలలో 4 రోజుల పాటు సెన్సస్ మొబైల్ యాప్ వాడకం, ప్రతి ఇంటికి తిరిగి డేటా శిక్షణ ఇచ్చామన్నారు.