ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం రాత్రి రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు. కోడిపందేలు, గుండాటలకు మాత్రమే పరిమితమైన సంక్రాంతి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేయడంతో భారీగా జనం తరలి వచ్చారు. అధికారుల నుంచి అనుమతి మాత్రం రాలేదు. అయినప్పటికీ రాత్రి డాన్సులు ఏర్పాటు చేశారు.