ఏడేళ్ల తర్వాత తీర్పు.. ముద్దాయికి జైలు శిక్ష

54చూసినవారు
ఏడేళ్ల తర్వాత తీర్పు.. ముద్దాయికి జైలు శిక్ష
బస్సును అజాగ్రత్తగా నడిపి, వ్యక్తి మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ శ్రీధర్ కు ఏడాది జైలు శిక్ష, రూ. 6 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని అమలాపురం సీఐ వీరబాబు సోమవారం తెలిపారు. 2017 జూలై 18న బైక్ పై వెళ్తున్న వీరబాబును బట్నవిల్లిలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అప్పట్లో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారని సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్