దుర్గం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు వెంటనే పరిష్కరించాలి
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్. డి. టి ఎకాలజీ సెంటర్ లో సోమవారం కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ కు సంబంధించి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదితరులు అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను గడువులోగా వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.