కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అనపర్తిలో శనివారం ఐఎమ్ఏ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామంటూ అనపర్తి మెయిన్ రహదారిలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ల రక్షణ చట్టం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.