పెదపూడి మండలం దోమడ ఎంపిపి స్కూల్ ఆవరణములో గురువారం ఎంఈఓ సత్యనారాయణ ఆదేశాల మేరకు పాఠశాల ప్రధానఉపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారులతో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భార్గవి టీచర్ మాట్లాడుతూ బాలల దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.