అనపర్తిలో హెల్మెట్ వాడకంపై పోలీసులు అవగాహన ర్యాలీ

79చూసినవారు
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. హెల్మెట్ వాడకంపై అనపర్తి లో శనివారం సాయంత్రం అవగాహన ర్యాలీ చేపట్టారు. ముందుగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అనపర్తి దేవి చౌక్ నుంచి గాంధీ బొమ్మవరకు పోలీసుల ర్యాలీ కొనసాగింది. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. అదనపు ఎస్ఐ దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్