అనపర్తిలో సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం

59చూసినవారు
అనపర్తి టీటీడీ కల్యాణ మండపంలో శ్రీ శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది. త్యాగరాజు రామ భక్తి అంశంపై షణ్ముఖ శర్మ ప్రసంగించారు. ఈ సందర్భంగా త్యాగరాజు కీర్తనలు రామభక్తిని సోదాహరంగా వివరించారు. శారద సంగీత కళా సమితి సభ్యులు, ప్రముఖులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్