ఆకట్టుకున్న యువతుల నృత్య ప్రదర్శన

76చూసినవారు
ఆకట్టుకున్న యువతుల నృత్య ప్రదర్శన
మామిడికుదురు మండలం నగరం గ్రామ దేవత శ్రీ దొడ్డి గంగాలమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. యువతులు తలపై బిందెలు పెట్టుకొని మంటలు వెలిగించి చేసిన నృత్యాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. పలువురు అమ్మవారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్