4వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 & సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది ఒకచోట ఉండకూడదని నగరం ఎస్ఐ సురేష్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బాణసంచా, బైక్ ర్యాలీలు, మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి నడపడం చేయకూడదని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.