జగ్గంపేట గ్రామం పల్లపు వీధిలో ఉన్న జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 87వ వార్షికోత్సవ మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శుక్రవారం స్వామివారి సన్నిధిలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు కొమ్మోజు సత్యనారాయణ మాట్లాడుతూ నేటితో బ్రహ్మంగారి మహోత్సవాలు ముగియనున్నాయని చివరి రోజు శుక్రవారం రాత్రి అఖండ దీపారాధన కార్యక్రమం ఉందని తెలిపారు.