రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు సహకరించాలని జగ్గంపేట సీఐ వైఆర్కె శ్రీనివాస్ కోరారు. సోమవారం కిర్లంపూడి మండలంలోని జగపతినగరం, కిర్లంపూడి, రాజుపాలెం గ్రామాల్లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో ప్రమాదాల కన్నా ద్విచక్ర వాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్, యూనిఫామ్ కలిగి ఉండాలన్నారు.