జగ్గంపేట ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అసోసియేషన్ తరపున మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్ వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తూ మంచి ఫలితాలు సాధిస్తునందుకు ప్రైవేటు స్కూల్స్ వారిని అభినందించారు.