భారత దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో కాకినాడ లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పేదలకు ఐదు కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఏర్పర్చిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 809 పేదలకు అన్నదానం చేశారు.