శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడంతో కాకినాడలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగిస్తున్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో అమ్మవారు బంగారు చెరువులో భక్తులు దర్శించారు.