ఖరిఫ్ 2024-25 రైతులు పండిచిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తుకులకు అమ్ముకొని మోసపోకుండా నాణ్యత ప్రమాణాలకు లోబడి వున్నా ధాన్యమునకు కనీస మద్దతు ధర పొందాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వo వారు కాకినాడ జిల్లాలో 277 ధాన్యము కొనుగోలు కేంద్రాలను రైతు సేవ కేంద్రాలలో ఏర్పటు చేయటం జరిగిందని తెలిపారు.