జెడ్పీటీసీ సభ్యుల కోరం పూర్తయ్యింది. అధికారులు హాజరయ్యారు. అయినా శుక్రవారం జరగాల్సిన కాకినాడ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఉపాధ్యాయల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలలో సమస్యలపై చర్చించే అవకాశం లేనందున వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ అధ్యక్షులు విప్పర్తి వేణుగోపాల్ స్పష్టం చేశారు. తొలుత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.