స్వయంభు కాకినాడ భోగిగణపతి పీఠంలో వరలక్ష్మీవ్రతం సందర్భంగా 108వెండి పుష్పాల తో లక్ష్మీ పూజ ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ లో పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ లక్ష్మీ పూజ అంటే ధన కనక వస్తురూపాలను అర్థించడానికి కాదని, మనలో ఉన్న భక్తి భావాన్ని పెంపొందించేందుకు పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించామన్నారు.