సిద్ధార్ధ ఆసుపత్రి 1983 నుండి రోగులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నారని, ఆధునిక సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు(నానాజీ) అన్నారు. సిద్ధార్థ ఆసుపత్రి నందు రోబోటిక్ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స సేవలు బుధవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడలో రోబోటిక్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.