కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రతీ నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, లబ్దిదారులకు ఫించన్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అన్నా క్యాంటిన్లను ప్రారంభించి, పేదవాడి కడుపు నింపుతామన్నారు.