చాగల్లు మండలంలో మానవత ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా చాగల్లు మెయిన్ బజారులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మానవత అడ్వైజరీ సభ్యులు కరుటూరి సతీష్ గాంధీ సిద్దాంతాలు నేటి సమాజానికి, ప్రత్యేకంగా యువతకు అవసరమని తెలిపారు. విగ్రహానికి పూలమాల వేసేందుకు కేతా సాహెబ్, ఛైర్మన్ జుజ్జవరపు వెంకటకృష్ణ ప్రసాద్, కన్వీనర్ జుట్టాకృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.