రాష్ట్రాభివృద్ధి చెందడానికి తయారు చేసే ప్రణాళికా కార్యక్రమంలో అన్నివర్గాలు భాగస్వామ్యం వహించాలని ఎంపి పి.మట్టా వీరాస్వామి అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర@2047 సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడివో ఆర్ శ్రీదేవి, తాహశీల్దార్ ఎం మెరికమ్మలు పాల్గొని మండల లెవెల్ అధికారులు, ఎంపిటీసిలు సర్పంచ్ లు కార్యదర్శులు నాయకుల నుండి సలహాలు, సూచనలను స్వీకరించి ప్రణాళిక రూపకల్పన చేశారు.