కొవ్వూరు పట్టణంలో విద్యుత్తు చార్జీల ధరలు పెంచడం పట్ల శుక్రవారం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. 14వ వార్డు బ్రిడ్జిపేట కౌన్సిలర్ చీర అరుణ్ కుమారి, యాసరపు శ్రీనివాసరాజు, చీర వెంకటరమణ, బంగారుబాబు, కార్యకర్తలు, నాయకులు, మహాధర్నగా వెళ్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ ధరలు తగ్గించాలని ఏఈకి వినత పత్రం అందజేశారు.