Oct 28, 2024, 11:10 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
Oct 28, 2024, 11:10 IST
భూములకు సంబంధించిన సమస్యలను కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 8 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు.