జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం బాలల దినోత్సవ వేడుకలు పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోలాహలంగా జరిగాయి. తొలుత నెహ్రూ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్కేఆర్ ఎం కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాలల దినోత్సవ విశిష్టతను సీనియర్ ఉపాధ్యాయులు ఏఎస్ఆర్ఎస్ శర్మ, స్టాఫ్ సెక్రటరీ కే శ్రీనివాస్ వివరించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.