పుష్కర ఘాట్లో సౌకర్యాల లేమి

54చూసినవారు
దక్షిణ కాశీగా పేరు పొందిన కాట్రేనికోన మం. కుండలేశ్వరంలోని పార్వతీ సమేత కుండలేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు పుష్కర ఘాట్ వద్ద సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. పుష్కర ఘాట్లో స్నానం చేసేందుకు అనువుగా లేకపోవడం, ఆలయం వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పంచాయతీ, దేవదాయ శాఖ అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్