మామిడికుదురు పంట కాలువలో భారీగా చెత్త పేరుకుపోయింది. దీంతో కాలువ కింది ప్రాంతాలకు సాగునీటి సరఫరా ఇబ్బందిగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూకాలమ్మ ఆలయం సమీపంలో తాగునీటి పైపు కాలువలో అడ్డంగా ఉండటం వల్ల అక్కడ ప్రతిసారి చెత్త భారీగా పేరుకుపోతోందని రైతులు వాపోతున్నారు. సమస్య పరిష్కారంపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని రైతులు గురువారం డిమాండ్ చేశారు.